14, ఏప్రిల్ 2013, ఆదివారం

అమరావతి పట్టణం



అమరావతి మ్యాప్ క్రీశ. 1796
- కల్నల్ మెకెంజీ కలెక్షన్

ఆంధ్రనగరి

అమరావతి

గుంటూరుకి 35 కిమీ దూరం. కృష్ణానది కుడి ఒడ్డున ఉంది. (1634ʹN–8017ʹE). గుంటూరు నుండి రోడ్డు మార్గం బాగానే ఉంటుంది. విజయవాడ నుండి తాడేపల్లి, ఉండవల్లి మీదుగా కృష్ణ ఒడ్డున మరొక రోడ్డు ఉంది కానీ ... అది ఎవరో పూర్వపు శాతవాహన చక్రవర్తి ఒకడు కొండని తొలిచి నిర్మించాడట! అ తరువాత మన ప్రభుత్వం మాత్రం రిపేర్లు చేబట్టిన ఆనవాళ్ళు లేవు. గుంటూరు మీదుగా ప్రయాణమే ఉత్తమం.
సందర్శన వేళలు
చైత్యం : ఉ 8 గం. - సా 5 గం. వరకు.
మ్యూజియం : ఉ 10 గం. - సా 5 గం. వరకు
(శుక్రవారం శెలవు)